Daily Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక ప్రగతి | Today Telugu Horoscope On Jan 16th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక ప్రగతి

Published Tue, Jan 16 2024 7:03 AM | Last Updated on Tue, Jan 16 2024 10:07 AM

Horoscope Today Today 16-01-2024 Telugu - Sakshi

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. ఒక సంçఘటన ఆకట్టుకుంటుంది. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవచింతన.

వృషభం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు.

మిథునం: బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. బంధువులతో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. 

కన్య: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. ఆస్తి, ధనలాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.
 
తుల: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు..

వృశ్చికం: ముఖ్యమైన పనుల్లో జాప్యం. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. 

ధనుస్సు: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వస్తులాభాలు.

మకరం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కొంత తగ్గుతుంది. బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. 

కుంభం: ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవదర్శనాలు.

మీనం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement