
శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.పంచమి రా.2.23 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం ఆరుద్ర రా.3.46 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.11.24 నుంచి 1.05 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.35 వరకు, తదుపరి ప.2.22 నుంచి 3.07 వరకు అమృతఘడియలు... సా.5.17 నుంచి 6.58 వరకు.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ధనలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. స్థిరాస్తి లాభాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: సన్నిహితుల నుంచి ధనలాభం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. నూతన పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత భారంగా మారతాయి.
సింహం: ఆప్తుల సలహాలు పాటిస్తారు. ధన, వస్తులాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.
కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. అందరిలోనూ గౌరవం. భూలాభాలు. నూతన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ ఆశలు ఫలిస్తాయి.
తుల: వ్యవహారాలలో కొన్ని అవాంతరాలు. రుణాలు చేస్తారు. మీ ఆలోచనలు కలసిరావు. బాధ్యతలతో సతమతమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
వృశ్చికం: విద్యార్థులకు ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. రుణభారాలు తప్పవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపార విస్తరణలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.
ధనుస్సు: కొత్త పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.
మకరం: ధనలబ్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం: ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో వివాదాలు.
Comments
Please login to add a commentAdd a comment