
శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.షష్ఠి రా.2.33 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం పునర్వసు తె.4.30 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి పుష్యమి, వర్జ్యం సా.4.10 నుంచి 5.48, వరకు, దుర్ముహూర్తం ఉ.8.21 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.05 నుంచి 12.51 వరకు అమృతఘడియలు... రా.2.04 నుంచి 3.40 వరకు.
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం: కార్యక్రమాలలో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహం.
వృషభం: కార్యక్రమాలలో తొందరపాటు. బంధువులతో తగాదాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
మిథునం: ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
కర్కాటకం: ప్రయాణాల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. వ్యాపారులకు చిక్కులు. బంధువిరోధాలు.
సింహం: మిత్రులతో సత్సంబంధాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
కన్య: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వస్తులాభాలు. కుటుంబసౌఖ్యం. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు.
తుల: రుణదాతల నుంచి ఒత్తిడులు. కార్యక్రమాలలో అవరోధాలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యభంగం. మానసిక ఆందోళన. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధుల్లో సమస్యలు.
వృశ్చికం: కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఉద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారులు మరింత కష్టించాలి. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగులకు నిరుత్సాహం.
ధనుస్సు: కార్యజయం. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. వ్యాపారులకు ప్రోత్సాహం.
మకరం: చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సానుకూలత.
కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.
మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
Comments
Please login to add a commentAdd a comment