
శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి సా.6.01 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం విశాఖ ఉ.11.44 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం ప.3.26 నుంచి 4.56 వరకు దుర్ముహూర్తం ఉ.6.36 నుంచి 8.04 వరకు అమృతఘడియలు... రా.12.25 నుంచి 1.56 వరకు.
సూర్యోదయం : 6.37
సూర్యాస్తమయం : 5.37
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
మేషం : వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
మిథునం : నిరుద్యోగులకు ఉద్యోగలాభం. నూతన పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కర్కాటకం : పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
సింహం : వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. ధనవ్యయం.
కన్య : ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.సన్నిహితులతో సఖ్యత. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల : పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృశ్చికం : శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. అనుకోని సంఘటనలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
ధనుస్సు : వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
కుంభం : నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. విలువైన సమాచారం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మీనం : కార్యజయం. ఆస్తుల వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment