
శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.పాడ్యమి ఉ.9.26 వరకు, తదుపరి విదియ నక్షత్రం శ్రవణం పూర్తి(24గంటలు), వర్జ్యం ఉ.10.16 నుంచి 11.54 వరకు, దుర్ముహూర్తం ఉ.10.16 నుంచి 11.01 వరకు, తదుపరి ప.2.44 నుంచి 3.26 వరకు, అమృతఘడియలు... రా.7.54 నుంచి 9.26 వరకు, మకర సంక్రాంతి, ఉత్తరాయణం ప్రారంభం.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.40
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: బంధుగణంతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు. ఆసక్తికర సమాచారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కన్య: ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. సోదరులతో విభేదాలు పరిష్కారం. వస్తులాభాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
తుల: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
వృశ్చికం: ధనప్రాప్తి. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. ముఖ్య నిర్ణయాలు. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.
ధనుస్సు: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
మకరం: శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. బంధువర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం: ఆసక్తికర సమాచారం. బంధువులతో వివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment