
శ్రీశార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.షష్ఠి రా.7.05 వరకు తదుపరి సప్తమి నక్షత్రం స్వాతి రా.8.46 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.1.48 నుంచి 3.20 వరకు దుర్ముహూర్తం ప.12.26 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.56 నుంచి 3.46 వరకు అమృతఘడియలు..ప.12.21 నుంచి 1.54 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు..
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం 5.47
సూర్యాస్తమయం 6.18
రాశిఫలం:
మేషం: ఇంటాబయటా మరింత ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
వృషభం: ఆర్థిక పరిస్థితి ముందుకంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయం అందుతుంది. పనుల్లో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.
మిథునం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహపరుస్తాయి.
ర్కాటకం: కొన్ని పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఉద్యోగ, వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి..
కన్య: శ్రమ తప్పదు. పనులు కొన్ని ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.. ఆలయాలు సందర్శిస్తారు.
తుల: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వృశ్చికం: బంధువులతో అకారణంగా విభేదాలు. పరిస్థితులు అనుకూలించవు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమాధిక్యం.
ధనుస్సు: పనులు జాప్యం లేకుండా పూర్తి. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. చర్చలు సఫలం.
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలిస్తాయి. సోదరుల ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కుంభం: పనులలో తొందరపాటు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు.
మీనం: ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment