
శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.ఏకాదశి ప.12.03 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం శతభిషం ఉ.8.55 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ప.3.45 నుంచి 5.27 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.04 వరకు, తదుపరి రా.10.30 నుంచి 11.20వరకు, అమృతఘడియలు... రా.2.03 నుంచి 3.45 వరకు.
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 5.29
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
మేషం: వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
వృషభం: ముఖ్యమైన పనుల్లో పురోగతి. భూలాభాలు. పాతమిత్రుల కలయిక. డబ్బుకు లోటు రాదు. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు తుదిక్షణంలో వాయిదా. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
కర్కాటకం: బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
సింహం: సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
కన్య: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
తుల: వివాదాలతో సతమతమవుతారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: ఆర్థికంగా ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆస్తుల కొనుగోలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
ధనుస్సు: బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. కొన్ని వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.
మకరం: కొన్ని పనులను అనూహ్యంగా వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.
కుంభం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
మీనం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. బంధువులతో వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి.
Comments
Please login to add a commentAdd a comment