జూన్‌ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి వస్తులాభాలు, వివాదాల నుంచి విముక్తి Horoscope Today: Rasi Phalalu On 21-06-2024 In Telugu. Sakshi
Sakshi News home page

జూన్‌ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి వస్తులాభాలు, వివాదాల నుంచి విముక్తి

Published Fri, Jun 21 2024 7:04 AM | Last Updated on Fri, Jun 21 2024 9:27 AM

Daily Horoscope Telugu June 21 2024 Rasi Phalalu

వర్జ్యం: రా.2.27 నుండి 4.04 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.20 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు  

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, 
తిథి: శు.చతుర్దశి ఉ.6.37 వరకు, తదుపరి పౌర్ణమి, 
నక్షత్రం: జ్యేష్ఠ సా.6.22 వరకు, తదుపరి మూల 

సూర్యోదయం :  5.30
సూర్యాస్తమయం    : 6.33

అమృతఘడియలు: ఉ.9.18 నుండి 10.56 వరకు.

మేషం: బంధువుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు. పనుల్లో ఆటంకాలు. రాబడికి మించి ఖర్చులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

సింహం: నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిడులు.వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: పనులు చకచకా సాగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. కొన్ని వివాదాల నుండి విముక్తి. వస్తులాభాలు. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు కీలక సమాచారం.

తుల: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్రమైన సంఘటనలు. బంధువుల కలయిక. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పండితగోష్ఠులలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కుంభం: రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పనులు మధ్యలో నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement