Today Telugu Horoscope On 30th June, 2023: Know Astrological Predictions Of Your Zodiac Signs - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి అన్నింటా విజయం.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Published Fri, Jun 30 2023 6:47 AM | Last Updated on Fri, Jun 30 2023 9:22 AM

Horoscope Today 30 06 2023 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, 
తిథి: శు.ద్వాదశి రా.9.55 వరకు, తదుపరి త్రయోదశి, 
నక్షత్రం: విశాఖ ప.1.24 వరకు, తదుపరి అనూరాధ, 

వర్జ్యం: సా.5.24 నుండి 6.57 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.8.09 నుండి 9.01 వరకు తదుపరి ప.12.28 నుండి 1.22 వరకు, 
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, 
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, 
సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.34. 


అమృతఘడియలు: రా.2.53 నుండి∙4.26 వరకు; 

Today Rashi Phalalu

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటాయి.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: ఉద్యోగాలలో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. పనుల్లో పురోగతి. వాహనసౌఖ్యం. శుభవర్తమానాలు. పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా సాగుతారు.

కర్కాటకం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

సింహం: వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు.

కన్య: ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

తుల: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. బంధువర్గంతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల పరిష్కారం.

ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆసక్తికర సమాచారం. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.

కుంభం: కొన్ని పనులు నిదానిస్తాయి. స్వల్ప ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు.

మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఉద్యోగయత్నాలలో కొంత ఇబ్బంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement