ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలం.. ధనలాభం | Today Telugu Horoscope On June 14th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలం.. ధనలాభం

Published Fri, Jun 14 2024 6:53 AM | Last Updated on Fri, Jun 14 2024 9:57 AM

Horoscope Today Rasi Phalalu On 14-06-2024 In Telugu

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

వృషభం: రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువిరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి. సంఘంలో ఆదరణ. ఆభరణాలు, వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

సింహం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: అనుకున్న పనుల్లో పురోగతి. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.

తుల: కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ధనవ్యయం. మిత్రుల నుంచి సమస్యలు. దైవచింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

ధనుస్సు: మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న మార్పులు సంభవం.

మకరం: రుణాలు చేస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.

మీనం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement