
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
సూర్యోదయం: 6.37, సూర్యాస్తమయం: 5.50
తిథి: శు.ఏకాదశి ప.3.39 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం: మృగశిర తె.4.43 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి ఆరుద్ర,
వర్జ్యం: ఉ.8.58 నుండి 10.43 వరకు,
దుర్ముహూర్తం: ప.11.50 నుండి 12.35 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
అమృతఘడియలు: రా.7.16 నుండి 9.01 వరకు, భీష్మ ఏకాదశి.
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి .ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.
కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గొరవం. ఆస్తిలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కన్య: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
తుల: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.
వృశ్చికం: ఆస్తుల విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలం.
ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం: రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు.
మీనం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో నిరాశ.
Comments
Please login to add a commentAdd a comment