
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.54
తిథి: బ.విదియ రా.3.03 వరకు, తదుపరి తదియ,
నక్షత్రం: మఖ సా.4.55 వరకు, తదుపరి పుబ్బ,
వర్జ్యం: రా.1.34 నుండి 3.20 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు
తదుపరి రా.10.58 నుండి 11.50 వరకు,
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
అమృతఘడియలు: లేవు
మేషం: వ్యవహారాలను సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపార, ఉద్యోగాలు పుంజుకుంటాయి.
వృషభం: మిత్రుల ద్వారా ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మిథునం: కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజసేవలో పాల్గొంటారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
సింహం: పనుల్లో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా ఉంటాయి.
కన్య: ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
తుల: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వివాదాల నుండి బయటపడతారు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
వృశ్చికం: ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆసక్తికర సమాచారం రాగలదు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.వ్యాపార విస్తరణ ఫలిస్తుంది. ఉద్యోగాలలో అంచనాలు నెరవేరతాయి.
ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ప్రయాణాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. చిత్రమైన సంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.
మీనం: వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
Comments
Please login to add a commentAdd a comment