శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి అమావాస్య ప.3.32 వరకు, తదుపరి జ్యేష్ఠ శు.పాడ్యమి నక్షత్రం కృత్తిక ఉ.6.25 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం రా.11.55 నుండి 1.40 వరకు, దుర్ముహూర్తం ప.12.22, నుండి 1.14 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.49 వరకు, అమృతఘడియలు... తె.5.10 నుండి 6.54 వరకు (తెల్లవారితే మంగళవారం).
సూర్యోదయం : 5.29
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కన్య: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యం. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
వృశ్చికం: ఆత్మీయులతో సఖ్యత. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం: మిత్రులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
కుంభం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.
మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
Comments
Please login to add a commentAdd a comment