Horoscope Today: January 31, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

దిన ఫలం: ఈ రాశివారికి ఉద్యోగాల్లో మంచి ఫలితం.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Published Tue, Jan 31 2023 6:45 AM | Last Updated on Tue, Jan 31 2023 8:40 AM

today horoscope 31 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,
సూర్యోదయం: 6.37, సూర్యాస్తమయం: 5.50.

తిథి: శు.దశమి ప.2.34 వరకు, తదుపరి ఏకాదశి,
నక్షత్రం: రోహిణి రా.2.59 వరకు, తదుపరి మృగశిర,
వర్జ్యం: సా.6.32 నుండి 8.15 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.34 వరకు,
తదుపరి రా.10.55 నుండి 11.46 వరకు,

అమృతఘడియలు: రా.11.33 నుండి 1.12 వరకు;
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు,
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,  


మేషం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
వృషభం: వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మిథునం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కర్కాటకం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మంచి ఫలితం ఉంటుంది.
సింహం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కన్య: విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
మకరం: పనులు మధ్యలో విరమిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మీనం: సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement