
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, వారం, శుక్రవారం, పాడ్యమి రాత్రి 01.16 వరకు, తదుపరి విదియ, వర్జ్యం మ12.04 నుండి 01.34 వరకు, దుర్ముహూర్తం ఉ.08.20 నుండి 09.05 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.52 వరకు, అమృతఘడియలు... రా.09.04 నుండి 10.34 వరకు, కార్తీక - ఆకాశ దీప ప్రారంభం
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : 10.30 నుంచి 12.00 వరకు
యమగండం : మధ్యాహ‍్నం 3.00 నుంచి 4.30 వరకు
రాశి ఫలాలు:
మేషం... పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
వృషభం.. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
మిథునం... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఖర్చులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
సింహం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. భూవివాదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కన్య.... కుటుంబసభ్యులతో విభేదాలు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.
తుల..... పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం... సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
ధనుస్సు.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
మకరం..... ఇంటర్వ్యూలు అందుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. బాకీలు వసూలవుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
కుంభం... వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మీనం.... శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగమార్పులు.
Comments
Please login to add a commentAdd a comment