
శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.సప్తమి ప.3.42వరకు తదుపరి అష్టమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ప.11.55 వరకు, తదుపరి రేవతి వర్జ్యం రా.12.22 నుండి 2.01 వరకు దుర్ముహూర్తం సా.4.10 నుండి 4.52వరకు, అమృతఘడియలు... ఉ.7.01 నుండి 8.43 వరకు.
సూర్యోదయం : 6.37
సూర్యాస్తమయం : 5.37
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు:
మేషం... పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టం వృథాగా మారుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
వృషభం... ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మిథునం... వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
కర్కాటకం.. శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
సింహం... కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.
తుల.. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తిలబ్ధి. దైవదర్శనాలు. కుటుంబసమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృశ్చికం... పనుల్లో స్వల్ప ఆటంకాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు... బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మకరం... నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి.
కుంభం... వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మీనం.... సంఘంలో గౌరవం లభిస్తుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు. కుటుంబసమస్యల నుంచి విముక్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment