
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.తదియ రా.2.24 వరకు, తదుపరి చవితి నక్షత్రం హస్త సా.5.21 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం రా.12.55 నుండి 2.28 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుండి 10.43 వరకు తదుపరి ప.2.48 నుండి 3.37 వరకు అమృతఘడియలు... ఉ.11.31 నుండి 11.35 వరకు.
సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: యత్నకార్యసిద్ధి. వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
వృషభం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలలో మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు
మిథునం: ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలం
కర్కాటకం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. భూలాభాలు. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు.
కన్య: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరతాయి. వ్యాపారాలు , ఉద్యోగాలు ఆశించినరీతిలో ఉంటాయి.
తుల: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
వృశ్చికం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
ధనుస్సు: నూతన పరిచయాలు. సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: రుణయత్నాలు. ప్రయాణాలలో కొన్ని మార్పులు. పనులు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకర మార్పులు
Comments
Please login to add a commentAdd a comment