
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.దశమి ఉ.10.28 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ ఉ.6.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ తె.5.42 వరకు (తెల్లవారితే శుక్రవారం), వర్జ్యం ప.2.26 నుండి 3.58 వరకు దుర్ముహూర్తం ఉ.9.55 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.45 నుండి 3.54 వరకు, అమృతఘడియలు... రా.11.35 నుండి 1.07 వరకు.
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.03
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం.... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. దైవదర్శనాలు.
వృషభం... వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది. సోదరుల కలయిక.
మిథునం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యాపారవృద్ధి. ముఖ్య నిర్ణయాలు.
కర్కాటకం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
సింహం... కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
కన్య... ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
తుల... ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం... శ్రమ ఫలించదు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
ధనుస్సు... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం... ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం... శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.
మీనం... పనులు పూర్తి. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పోటీపరీక్షల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.
Comments
Please login to add a commentAdd a comment