
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.త్రయోదశి తె.4.28 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి చతుర్దశి, నక్షత్రం భరణి ఉ.8.40 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం రా.9.51 నుండి 11.34 వరకు, దుర్ముహుర్తం ఉ.10.04 నుండి 10.48 వరకు, తదుపరి ప.2.27 నుండి 3.11 వరకు, అమృతఘడియలు... లేవు.
సూర్యోదయం : 6.26
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు:
మేషం... ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. సోదరులు, మిత్రుల కలయిక.వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు.
వృషభం... ఆలోచనలు కలసివస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో ఒçప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి.
మిథునం... ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
కర్కాటకం... ఆదాయం ఆశాజనకం. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
సింహం... దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. కార్యజయం. శ్రమ వృథా కాదు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.
కన్య... కార్యక్రమాలలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. అనారోగ్యం. రాబడి తగ్గుతుంది. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగులకు అదనపు పనిభారం.
తుల.... ప్రయాణాలలో ఆటంకాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులు, స్నేహితులతో కలహాలు. రాబడి అంతగా కనిపించదు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు ఒడిదుడుకులతో సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు.
వృశ్చికం.. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
ధనుస్సు... ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం.
మకరం... ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు స్థానచలనం.
కుంభం... ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువిరోధాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. విలువైన సామగ్రి జాగ్రత్త . అనారోగ్య సూచనలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మీనం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. అదనపు ఆదాయం చేకూరుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment