
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి బ.పాడ్యమి తె.5.07 వరకు (తెల్లవారితే బుధవారం) తదుపరి విదియ, నక్షత్రం ఉత్తరాభాద్ర తె.5.32 వరకు (తెల్లవారితే బుధవారం) తదుపరి రేవతి, వర్జ్యం ప.2.35 నుండి 4.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.44 నుండి 11.31 వరకు అమృతఘడియలు... రా.12.33 నుండి 2.13 వరకు.
సూర్యోదయం : 5.52
సూర్యాస్తమయం : 5.56
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు:
మేషం.. కొన్ని పనులలో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు రద్దు. బంధువులతో విభేదాలు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
వృషభం... నూతన పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కతాయి. ప్రముఖుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం... పనులు చకచకా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. అరుదైన పురస్కారాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం.... బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనులు మందకొడిగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం.... కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు.
కన్య.... అంచనాలు నిజమవుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
తుల.. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. అనుకున్నది సాధిస్తారు. ఆలయాల సందర్శనం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
వృశ్చికం... పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ ఫలించదు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆస్తిలాభం. ఆలయ దర్శనాలు.
ధనుస్సు.... ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.
మకరం... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం.
కుంభం... కుటుంబసభ్యులతో వైఖరి. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు డీలాపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం.. వ్యాపారవృద్ధి. కీలక నిర్ణయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment