
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి బ.అష్టమి ఉ.7.36 వరకు, తదుపరి నవమి తె.5.36 వరకు(తెల్లవారితే సోమవారం), నక్షత్రం శ్రవణం రా.8.44 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.12.33 నుండి 2.04 వరకు, దుర్ముహూర్తం సా.4.33 నుండి 5.23 వరకు అమృతఘడియలు...ఉ.10.59 నుండి 11.54 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృషభం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మిథునం: కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. కార్యక్రమాలలో అవరోధాలు. ఉదర సంబంధిత రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సింహం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహం.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
తుల: కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం: స్నేహితులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బ«ంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలపరిస్థితి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కుటుంబంలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మీనం: కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment