
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.సప్తమి ఉ.7.55 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం పునర్వసు ఉ.6.14 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం ప.2.46 నుండి 4.30 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుండి 10.34 వరకు, తదుపరి ప.2.23 నుండి 3.11 వరకు అమృతఘడియలు... రా.10.3 నుండి 2.45 వరకు.
సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం : 5.28
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం...పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృషభం....కొత్త విషయాలు తెలుసుకుంటాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
మిథునం....పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కర్కాటకం...శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యసాధన.
సింహం...వ్యవహారాలలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కన్య....మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు కొంటారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
తుల...వ్యవహారాలు విజయం. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
వృశ్చికం...రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు...బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం...ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం....కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో విజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం....దూరప్రయాణాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఆటుపోట్లు.
Comments
Please login to add a commentAdd a comment