
శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.చతుర్దశి ప.1.46 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం ఉత్తరాషాఢ రా.10.10 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం ఉ.7.09 నుండి 8.37 వరకు తదుపరి రా.1.58 నుండి 3.29 వరకు అమృతఘడియలు... సా.4.10 నుండి 5.41 వరకు.
సూర్యోదయం: 6.37
సూర్యాస్తమయం : 5.50
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
రాశి ఫలాలుః
మేషం.... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృషభం... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం... దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
సింహం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
కన్య.... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల.... ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృశ్చికం... కుటుంబసభ్యులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు... కుటుంబంలో కొత్త సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మకరం.... శుభకార్యాల యత్నాలు సఫలం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం.... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం.... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment