మేషం.. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు.. శివపంచాక్షరి పఠించండి.
వృషభం.. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారులకు విశేష ఆదరణ. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మిథునం.. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంత తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. గులాబీ, తెలుపు రంగులు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
కర్కాటకం.. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి.కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు.వారం చివరిలో దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం.. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. వారం ప్రారంభంలో కొన్ని విమర్శలు రావచ్చు. సోదరులతో కలహాలు. ప్రయాణాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. అంగారక స్తోత్రం పఠించండి.
కన్య.. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల.. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరిలో అనుకూల మార్పు కనిపిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో ధననష్టం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.
వృశ్చికం.. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కొంత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థుల శ్రమ వృథా కానుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. నలుపు, నీలం రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులలో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలలో అనుకూలస్థితి, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి..
మకరం.. అదనపు రాబడి ఉంటుంది. అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పసుపు, లేతనీలం రంగులు. శ్రీరామనామాలు స్మరించండి.
కుంభం.. వ్యయప్రయాసలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించే వరకూ విశ్రమించరు. ఆర్థిక వ్యవహారాలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల తగాదాలు. నీలం, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.
మీనం.. ఎంతటి పనైనా వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు నుంచి ఆహ్వానాలు రాగలవు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఆకర్షిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో మనోనిబ్బరం తగ్గుతుంది. మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. ఆకుపచ్చ, నీలం రంగులు. దత్తాత్రేయ పూజలుచేయండి.
Comments
Please login to add a commentAdd a comment