
మేషం..
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుండి బయపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు, హడావిడి కార్యక్రమాలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వివాదాలు. పసుపు. గులాబీ రంగులు. ఆంజనేయ స్తుతి మంచిది.
వృషభం..
నూతన వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. బంధువుల నుండి ఆస్తి లాభం. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం చాలావరకూ తగ్గుతుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్యభంగం. తెలుపు,ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మిథునం..
ప్రారంభంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మీ అంచనాల మేరకు మెరుగుపడుతుంది. రుణబాధలు తగ్గి ఊరట చెందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.. పారిశ్రామికరంగం వారికి శుభవార్తలు అందుతాయి.. వారం చివరిలో ఆస్తి వివాదాలు.మానసిక ఆందోళన. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది..
కర్కాటకం..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులు ఊహలు నిజం చేసుకుంటారు. ప్రత్యర్థులు సైతం మీకు చేదోడుగా నిలుస్తారు. పడిన శ్రమ కొలిక్కివస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు అందుతుంది. ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కొన్ని పనులు పూర్తి కాగలవు. మీ ఆలోచనలకు కార్యాచరణలో పెడతారు. వ్యాపారాల విస్తరణ ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు తగ్గవచ్చు. వీరిపై బాధ్యతల భారం తగ్గుతుంది.. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. గులాబీ, ఎరుపు రంగులు. శివారాధన మంచిది.
సింహం..
ఇంటాబయటా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఎంతోకాలంగా వే«ధిస్తున్న ఒక వివాదం నుంచి బయటపడే అవకాశం. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో శ్రమకు ఫలితం కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు పూర్వవైభవం దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు.మానసిక అశాంతి. ప్రయాణాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కన్య..
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వేడుకలకు ధనవ్యయం. రావలసిన సొమ్ము సజావుగా అందుకుంటారు. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగయత్నాలలో మీ కృషి నెరవేరుతుంది.. వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలు మీ అంచనాల మేరకు ఉంటాయి. ఉద్యోగులకు వి«ధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. పసుపు, నేరేడు రంగులు. శ్రీ ఇంద్రాక్షిస్తుతి మంచిది.
తుల..
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చే స్తారు.చిరకాల కోరిక నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు.విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు కీలక సమాచారం రావచ్చు. వీరు కోరుకున్న మార్పులు కూడా ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అన్ని వి«ధాలా కలసివస్తుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆప్తుల నుండి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు కొన్ని జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. ఇంటిలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి జీవితాశయం నెరవేరే సూచనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. మానసిక అశాంతి. తెలుపు, ఎరుపు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు..
ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇంటిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కొన్ని వివాదాలు తీరతాయి. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వచ్చి అనుకోని అవకాశాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధులు తేలిక పడతాయి. వీరికి తగిన గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికరంగం వారికి కలసివచ్చే కాలం. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకరం..
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో అనూహ్యమైన విజయం పొందుతారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు రావచ్చు. కళారంగం వారి యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఊహించని వివాదాలు. నీలం, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం..
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఎటువంటి నిర్ణయమైనా మరింత లోతుగా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఏ వ్యవహారంలోనూ తొందరవద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
మీనం..
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. కొన్ని వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు రావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో చర్చలు జరుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. మీ మాటకు కుటుంబంలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలలో అనుకోనిరీతిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, ఎరుపు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠనం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment