Telugu Weekly Astrology: Weekly Horoscope In Telugu 05-06-2022 To 11-06-2022 - Sakshi
Sakshi News home page

Weekly Horoscope: వారంలో ఈ రాశి వారికి వేధిస్తున్న సమస్యలు తీరుతాయి

Published Sun, Jun 5 2022 6:23 AM | Last Updated on Fri, Jun 10 2022 6:14 AM

Weekly Horoscope In Telugu 05-06-2022 To 11-06-2022 - Sakshi

రాశి ఫలాలు..

మేషం..
అనుకోని అతిథుల ద్వారా ముఖ్య సమాచారం. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఇంతకాలం వేధించిన సమస్య పరిష్కామవుతుంది. స్థిరాస్తులపై కుటుంబంలో ఒక అంగీకారానికి వస్తారు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు అనుకూల పరిస్థితులు, లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మరింత పురోగతి. కళాకారులకు కొన్ని అవకాశాలు దక్కే సూచనలు.  వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 

వృషభం..
పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. సోదరీ, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడి కొంత ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి  నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.  ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారవర్గాలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగస్తుల హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ముందుకు సాగి లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో  వృథా ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు.  స్వల్ప అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం..
 
ఆశించినంతగా ఆదాయం లేక అప్పులు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శారీరక రుగ్మతలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసిరావు. కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారస్తులు కొంత నిదానంగా ముందుకు సాగడం ఉత్తమం.  ఉద్యోగస్తులకు  విధి నిర్వహణలో చిక్కులు. రాజకీయవేత్తలకు వ్యయప్రయాసలు. వారం  మధ్యలో  శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన పరిచయాలు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..
ఆదాయం సంతృప్తికరంగా ఉండి అవసరాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు శుభవర్తమానాలు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకు వి«ధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం..
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. అవసరాలకు డబ్బు చేతికందుతుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.  మిత్రులతో మరింత ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం  శ్రద్ధ చూపండి.  విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన సమయమని చెప్పాలి. వారం ప్రారంభంలో  మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.  శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య..
ఆదాయం మరింత అనుకూలించి అప్పులు తీరతాయి. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరే సమయం. స్థిరాస్తులు కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనసౌఖ్యం. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఒక సంతోషకరమైన సమాచారం రాగలదు. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు.  వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  శివస్తోత్రాలు పఠించండి.

తుల.. కొత్త  పనులు  చేపడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారవర్గాలకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు రాగలవు.  వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం.  పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం..
ఆదాయం సంతృప్తినిస్తుంది. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగయోగం. ఆస్తి వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి.  ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు సమస్యల నుంచి విముక్తి.  వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు..
పరిస్థితులను మరింత అనుకూలంగా మలచుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. భూములు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మకరం..
ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు  సఫలం. వాపం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు.  నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం.. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. సేవాభావం పెరుగుతుంది. మీ మనస్సులోని భావాలను అందరితో పంచుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రాబడి  కొంత పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం రాగలదు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం..
ముఖ్యమైన పనులను విజయవంతంగా ముగిస్తారు. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహా వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు కీలక పదవులు దక్కవచ్చు. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనుకోని  ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.  కనకధారా స్తోత్రాలు పఠించండి.
 


 

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement