
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
నూతన ఉద్యోగప్రాప్తి. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో వివాదాలు. అనుకోని ఖర్చులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబ సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వీరికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. శివపంచాక్షరి పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణాలు తీరుస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment