
మేషం..
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొన్ని పోటీపరీక్షల్లో విజయం. బంధువులు, మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం కలుగుతుంది. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.
వృషభం..
పనులు విజయవంతమవుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖుల ద్వారా అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.వాహనసౌఖ్యం. ఒకప్రకటనపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలించి కొత్త బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికరంగం వారికి అరుదైన అవకాశాలు రాగలవు. వారం మధ్యలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మిథునం..
కొత్త పనులు చేపట్టి ముందుకు సాగుతారు. మీ విజ్ఞానానికి ప్రముఖులు ఆశ్చర్యపడతారు. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆశయాలు నెరవేరతాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ఆర్థిక ప్రయోజనాలు దక్కవచ్చు. కళారంగం వారి కృషి సఫలమవుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. నీలం, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం..
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. కొన్ని వివాదాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలను కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికరంగం వారికి అన్నింటా కలసివచ్చే కాలం. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. పసుపు, ఎరుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహం..
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు నూతన హోదాలు, మంచి గుర్తింపు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.
కన్య..
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల మాట, ఆర్థిక సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులులేదా పరిశోధనలు ఫలిస్తాయి. ఇతరులకు సాయపడేందుకు సిద్ధపడతారు. ఎటువంటి సమస్య ఎదురైనా లెక్కచేయరు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో మీ అంచనాలకు తగిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు హుషారుగా గడుస్తుంది. రాజకీయవర్గాలకు వివాదాలు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల..
వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. ప్రముఖులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. అనుకున్న పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు బాధ్యతల నిర్వహణలో వెనుకాడరు. కళారంగం వారికి సమస్యలు కొన్ని తీరతాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. రావలసిన బాకీలు కొన్ని వసూలవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. నీలం, పసుపు రంగులు. దేవీస్తుతి పఠించండి.
ధనుస్సు..
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొంత ఊరట కలిగే సమాచారం రావచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు మరింత ఆదరణ పొందుతారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం..
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు, వైద్యసేవలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. కళారంగం వారి ఆశలు నెరవేరే పరిస్థితి ఉండదు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. పనులలో విజయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. విష్ణుధ్యానం చేయండి.
కుంభం..
అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం. మీ నిర్ణయాలకు కుటుంబసభ్యులు కట్టుబడి ఉంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఆశలు నెరవేరవచ్చు. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు. మానసిక అశాంతి. పసుపు, గులాబీ రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.
మీనం..
కొన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గించుకుంటారు. రాజకీయవేత్తలకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. బం«ధువులతో తగాదాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment