Weekly Horoscope: ఈ వారం రాజకీయ నాయకులకి నూతనోత్సాహం | Weekly Career Horoscope, March 17- March 23, 2024 In Telugu - Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం రాజకీయ నాయకులకి నూతనోత్సాహం

Published Sun, Mar 17 2024 6:38 AM | Last Updated on Sun, Mar 17 2024 4:06 PM

Weekly Horoscope Telugu 17-03-2024 To 23-03-2024 - Sakshi

మేషం
అనుకున్న పనులు ఎంతగా శ్రమపడ్డా ముందుకు సాగవు. ఆత్మవిశ్వాసం, దృఢచిత్తంతో ముందడుగు వేయండి. ఆరోగ్య విషయాలు, వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్త అవసరం. బంధువులతో కొన్ని విభేదాలు తప్పకపోవచ్చు.  ఆదాయం కొంత తగ్గి నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.  ఆకుపచ్చ, ఎరుపు రంగులు. శివాలయ దర్శనం మంచిది.

వృషభం
ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు అందుతాయి. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.  సోదరీసోదరుల మధ్య తగాదాలు తీరతాయి. వాహనయోగం కలుగుతుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.  ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు.  విష్ణుధ్యానం చేయండి.

మిథునం
మొదట్లో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగుతారు. అనుకోని విజయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వివాదాలు పరిష్కరించుకుని సత్తా చాటుకుంటారు. ఎదురుచూసిన అవకాశాలతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైనరీతిలో మార్పులు ఉంటాయి.  కళాకారులకు నూతనోత్సాహం.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, పసుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు

కర్కాటకం
ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అయితే , క్రమేపీ వాటిని అధిగమిస్తారు. మీ పట్టుదల, కృషికి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుని వ్యవహారాలు సా«ధిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళాకారులకు అనుకోని అవకాశాలు.  వారం చివరిలో శ్రమ తప్పదు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. తెలుపు, గులాబీ రంగులు. అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

సింహం
అనుకున్న రాబడి దక్కుతుంది. కొంతకాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు,స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం కలిగి ఉపశమనం పొందుతారు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు.  గణేశాష్టకం పఠించండి.

కన్య
కొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు జరుగుతాయి. కొన్ని కొత్త సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్ధిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వారం చివరిలో కలిసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు.  వారం ప్రారంభంలో అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు.  గణపతి అర్చన చేయండి.

తుల
ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది.   గతంలో నిలిచిన కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు.  శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాహ కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు.   వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. హనుమా  ఛాలీసా పఠించండి.

వృశ్చికం
బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పేరు సంపాదిస్తారు. గతంలోజరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులు  విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి తథ్యం. ఉద్యోగులకు శుభవార్తలు వింటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధననష్టం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు
ఎంతోకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కొన్ని కార్యక్రమాలు యథాతథంగా పూర్తి చేస్తారు. జీవితాశయం సాధించేందుకు మీ యత్నాలలో బంధువులు సహకరిస్తారు. అనుకున్నది సాధించడంలో  విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభించే వీలుంది. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు.  వారం చివరిలో అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. బంధువిరోధాలు. దత్తస్తోత్రాలు పఠించండి.

మకరం
అనుకున్న పనులు జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు.  జీవితాశయం సా«ధనలో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, భూములు సమకూరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి.  వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. అనారోగ్యం.  ఎరుపు, తెలుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం
ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. వివాదాలను ఓర్పుతో అధిగమిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. సోదరుల మధ్య వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవులు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో తగాదాలు. గులాబీ, నీలం.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఓర్పు, నేర్పుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆత్మీయుల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. కొన్ని సమస్యలు వాటంతట అవే తీరతాయి. భూములు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి అధిగమిస్తారు.  కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. గులాబీ, పసుపు రంగులు. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement