ఈ రాశి వారు వారం చివరలో శుభవార్త వింటారు, ఆకస్మిక ధనలాభం | Weekly Horoscope Telugu 20-11-2022 To 26-11-2022 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారు వారం చివరలో శుభవార్త వింటారు, ఆకస్మిక ధనలాభం

Published Sun, Nov 20 2022 6:51 AM | Last Updated on Sun, Nov 20 2022 6:52 AM

Weekly Horoscope Telugu 20-11-2022 To 26-11-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వీరికి అన్నివిధాలా కలసివచ్చే కాలం. యత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ పేరుగడిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రతిభ నిరూపించుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చే వారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడి ఆశాజనకమే. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం. విద్యార్థుల యత్నాలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు అంచనాల మేరకు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. వారం ప్రారంభంలో ధనవ్యయం. లేత ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. 

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో  చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు.  వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామి దండకం పఠించండి. 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. పనులు కొన్ని సకాలంలో పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహనయోగం. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో  వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో వృథా ఖర్చులు, అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనులు మరింత నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్‌ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారుల యత్నాలలో కదలికలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. అసంపూర్తి పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.  వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం చివరిలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
రాబడి ఆశాజకనంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో  పరిష్కరించు కుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలో చికాకులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది.  కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. నలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement