ఈ వారంలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. | Weekly Horoscope Telugu 26 11 23 To 02 12 23 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope in Telugu: ఈ వారంలో ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..

Published Sun, Nov 26 2023 6:43 AM | Last Updated on Sun, Nov 26 2023 9:19 AM

Weekly Horoscope Telugu 26 11 23 To 02 12 23 - Sakshi

మేషం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజకనంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. గులాబీ, తెలుపు రంగులు. వారం చివరిలో ధననష్టం. చికాకులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సోదరులు,మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి శ్రమానంతరం ఫలితం ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. ఆకాశనీలం, లేత ఆకుపచ్చరంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. చోరభయం. ఎరుపు, చాక్లెట్‌రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరతాయి. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా. శ్రమ మరింత పెరుగుతుంది. పసుపు, లేత ఆకుపచ్చరంగులు,  విష్ణుధ్యానం చేయండి.

సింహం: గతం నుంచి వే«ధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కే సూచనలు. ఆదాయం మెరుగ్గా ఉన్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆప్తులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. నేరేడు, గులాబీరంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు,   ఆంజనేయ దండకం పఠించండి.

తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వస్తులాభాలు. జీవితాశయం నెరవేరుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. గులాబీ, పసుపురంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో శ్రమ కొంత పెరుగుతుంది. స్నేహితుల నుండి ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలంరంగులు. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు: పనులు చకచకా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మకరం: బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహకరిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. మీ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకుపచ్చ, చాక్లెట్‌ రంగులు. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

కుంభం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు.  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో సన్నిహితుల నుండి సమస్యలు. మనశ్శాంతి లోపిస్తుంది. నీలం, తెలుపురంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్తగా రుణాలు కూడా చేయాల్సివస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని వ్యవహారాలలో రాజీ తప్పదు. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. భూవివాదాలు, కోర్టు కేసులు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి.ఎరుపు, తెలుపురంగులు. ఈశ్వరారాధన మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement