టోల్ ప్లాజాల వద్ద సౌకర్యాల కల్పనే లక్ష్యం
ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌వో ఆర్‌కే సింగ్
మంగళగిరి: టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల కోసం వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌వో ఆర్‌కే సింగ్ తెలిపారు. నగర పరిధిలోని కాజ టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన కొత్త అంబులెన్స్‌లతోపాటు బేబి కేర్ రూమ్‌లను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అంబులెన్సులు, బేబీకేర్ రూంలు ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్ రవి, బేబీ కేర్ రూమ్ దాతలు శ్రీ వేంకటేశ్వర ఫుడ్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు పాలడగు కృష్ణ వంశీ,శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment