నేడు వైభవంగా శ్రీనివాస కల్యాణం
తాడికొండ:వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయంలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2,700 మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లుచేసినట్లు వివరించారు. సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వెంకటపాలెం చేరేందుకు వీలుగా 300 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కల్యాణోత్సవానికి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పుష్పాలకంరణ పనులు వేగంగా చేస్తున్నారు. దాదాపు 4 టన్నుల పూలు, 30 వేల క్లట్ ఫ్లవర్స్‌తో అలంకరణ చేశారు.
2,700 మంది తిలకించేలా ఏర్పాట్లు
భక్తుల రాక కోసం 300 బస్సులు
టీటీడీ ఈవో జె శ్యామలరావు
Comments
Please login to add a commentAdd a comment