గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా గ్రేడ్–3 ఏఎన్‌ఎంలుగా ఉండి ఎంపీహెచ్‌ఏగా ప్రమోషన్ పొందిన ఏఎన్‌ఎంల సమస్యలపై బుధవారం ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు బోడపాటి నాగవర్ధన్ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓకు వినతి పత్రం అందజేశారు. శాంక్షన్ పోస్టు ఉండి, ప్రొజిషన్ ఐడీ లేనివాటికి పీఎఫ్‌ఎంఎస్ దగ్గర జీతాలు త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. కాంట్రాక్టు, యూరోపియన్ ఫండ్‌లో పనిచేస్తూ రెగ్యులర్ అయిన ఏఎన్‌ఎంకు సబ్ సెంటర్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, శాలరీ డ్రాచేసిన చోట కూడా ఖాళీలు చూపించడం వల్ల కొంత మంది ఏఎన్‌ఎంలు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదుకు తగు ఉత్తర్వులు ఇచ్చి మెడికల్ డిపార్టుమెంట్ అటెండెంట్స్‌లో నమోదు చేయాలని కోరారు. సబ్ సెంటర్ బిల్డింగ్ పూర్తిగా శిథిలాస్థవకు చేరి హెచ్‌ఆర్‌ఏ లేనివారికి హెచ్‌ఆర్‌ఏ శాంక్షన్ చేసేవిధంగా చొరవ చూపాలని కోరారు. ఏఎన్‌ఎంల ప్రమోషన్‌లలో మిగిలిపోయిన ఖాళీలను పరిశీలించి ఇతర సిబ్బందికి కూడా ప్రమోషన్ అవకాశం కల్పించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ షరీఫ్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం.నరేంద్రబాబు, అంజిరెడ్డి, ఎం.శ్రీనివాస్, ఝాన్సిరాణి, ధనలక్ష్మి, మంగా దేవి, నాగవేణి, సంధ్యారాణి తదితరులు ఉన్నారు.