
తలసేమియా ట్రాన్స్‌ప్యూజన్ సెంటర్ నిర్మాణం
నరసరావుపేట: పల్నాడు జిల్లాకు రెడ్‌క్రాస్ ద్వారా తలసేమియా ట్రాన్స్‌ప్యూజన్ సెంటర్ మంజూరైందని, త్వరలో ప్రారంభిస్తామని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చే తలసేమియా, హిమోఫీలియా జబ్బులున్న వారికి ప్రతినెలా ఉచితంగా రక్తాన్ని అందజేస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం పట్టణంలోని సమావేశపు హాలులో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు.‘మీ డాక్టర్ మీ ఇంటికి’ అనే ప్రాజెక్టు మంజూరైందని, దీనిని త్వరలో ప్రారంభించి జిల్లాలో గిరిజన తండాలు, మత్స్యకారుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఆర్డీవో ఆఫీస్ కాంపౌండ్‌లో ఉన్న 15 సెంట్లు రెడ్‌క్రాస్ స్థలంలో నూతన భవన నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. ఇందులో ఓల్డ్‌ఏజ్ హోం, స్కిల్ డెవలప్‌మెంటు ట్రైనింగ్ సెంటర్, ఉచిత వైద్యశాల, అనాథ శరణాలయం, జనరిక్ మెడికల్ షాప్‌లను ప్రారంభిస్తామని వెల్లడించారు. రెడ్‌క్రాస్ బ్లడ్ సెంటర్‌కు ప్రస్తుత వేసవిలో రక్తకొరత ఏర్పడవచ్చని, రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేసేవారు, సంస్థ ద్వారా ప్రథమ చికిత్స శిక్షణను పొందదల్చినవారు, మెంబర్లుగా చేరేవారు 91000 78576 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. వైస్ చైర్మన్ పీవీఎం శరత్‌బాబు, కోశాధికారి గండ్రకోట మురళీకృష్ణ ప్రసంగిస్తూ జిల్లా రెడ్‌క్రాస్ ఏర్పడిన నాటి నుంచి న్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్మాణం కోసం విరాళాలు అందించిన దాతలు, సేవలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మేనేజింగ్ కమిటీ సభ్యులైన శ్రీనివాస గుప్తా, డాక్టర్ సృజన, వీరారెడ్డిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు సాంబశివరావు, జీవీఎస్ రాము, డాక్టర్ రహమతుల్లా, మాజీ కౌన్సిలర్ మస్తాన్‌వలి, జీవితకాల సభ్యులు మేళం శ్రీకృష్ణ, హనుమంత ప్రసాద్, కాసు దశరథరామిరెడ్డి పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి
ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో నూతన కార్యాలయం ఏర్పాటు