
న్యాయమూర్తులకు ఆత్మీయ వీడ్కోలు
చీరాల రూరల్ : చీరాల కోర్టులలో మూడేళ్లపాటు విధులు నిర్వర్తించి నెల్లూరు, విజయవాడ కోర్టులకు బదిలీపై వెళుతున్న న్యాయమూర్తులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రెహన, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ నిషాద్‌నాజ్‌లను చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం రాత్రి ఘనంగా సత్కరించారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులకు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు. మూడేళ్లపాటు ఇరువురు న్యాయమూర్తులు చీరాల కోర్టులలో ఎంతో ఓర్పుతో నేర్పుతో విధులు నిర్వర్తించి కక్షిదారులకు న్యాయ సహాయం అందించడంతో పాటు మంచి తీర్పులు అందించారని పేర్కొన్నారు. సీనియర్, జూనియర్ న్యాయవాదులు అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా చూసేవారని చెప్పారు. అలానే కోర్టులో పనిచేసే న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్ల పట్ల ఎంతో మంచిగా వ్యవహరించారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలను అలంకరించాలని న్యాయవాదులు ఆకాంక్షించారు. న్యాయవాదులు తమపై ఇంతటి ప్రేమ అనురాగాలు చూపడంపై న్యాయమూర్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు బండ్లమూడి విజయకుమార్, సెక్రటరి మేరుగ రవికుమార్, సభ్యులు నాశనరాము, ఆల్ఫ్రేడ్ రాజా సాల్మన్, సిరిపురం కామేశ్వరరావు, షేక్ మస్తాన్‌వలి, మహిళా ప్రతినిధి స్నేహ, న్యాయవాదులు ఎంవి. చలపతిరావు, కె. రవికుమార్ రెడ్డి, కె. రవి, ఎ. పుల్లయ్యనాయడు, ఆర్. రమేష్‌కుమార్, ఆర్. వెంకటేశ్వరరెడ్డి, బి. జయసన్‌బాబు, కె. ఉదయభాస్కరరావు, డి. పున్నయ్య, ఎన్. కస్తూరినాఽథ్, ఎస్‌కె. సిరాజ్, ఐ. గోపాలకృష్ణమూర్తి, ఎ. సతీస్‌రెడ్డి, పి. సాంబు, జె. శ్రీనాఽథ్, జి. సురేష్, డి. చైతన్య, ఎ. కొండయ్య, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.