ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో మంగళవారం ముదిగొండ, తల్లాడ జట్లు విజయం సాధించాయి. ముదిగొండ – ఏన్కూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముదిగొండ 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ జట్టులో పవన్ 43 బంతులు ఆడి ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏన్కూరు జట్టు విజయానికి సరిపడా పరుగులు చేయకపోవడంతో ముదిగొండ జట్టు గెలుపొందింది. అనంతరం తల్లాడ – జూలూరుపాడు మధ్య మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన తల్లాడ జట్టు 16ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఆపై జూలూరుపాడు జట్టు 16ఓవర్లలో 100పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. మ్యాచ్‌లను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్, కోచ్ ఎం.డీ.గౌస్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment