రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ
అశ్వాపురం: అశ్వాపురం మండలం మొండికుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐలు కందిమళ్ల సత్యనారాయణరెడ్డి రూ.25 లక్షలు, జాలె సుధాకర్‌రెడ్డి రూ.10 లక్షలతో పాటు మరికొందరు విరాళాలు ఇచ్చారు. తాజాగా గ్రామానికి చెందిన తిప్పారెడ్డి పిచ్చిరెడ్డి కుమార్తె – అల్లుడు గంగిరెడ్డి శ్రీలత–రాజమోహన్‌రెడ్డి దంపతులు ఆలయంలో ధూపదీప నైవేద్యాల కోసం ఏర్పాటు చేయనున్న మూలనిధికి మంగళవారం రూ.10లక్షలు విరాళంగా అందజేశారు. గతంలో మూడు గర్భాలయాలకు రూ.1.25లక్షల విలువైన సింహద్వారబంధాలు ఇచ్చారు. ఇక మల్లెలమడుగుకు చెందిన చల్లా మధుర–విజయరామరాజు దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేయగా, మేరెడ్డి రామిరెడ్డి–యశోదమ్మ జ్ఞాపకార్థం విగ్రహ ప్రతిష్ఠాపన రోజున 1000 మంది భక్తుల అన్నదానానికి అయ్యే ఖర్చు భరిస్తామని వారి కుమారులు మేరెడ్డి వెంకటరెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, చలపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. కాగా, దాతల విరాళాలతో ఆలయ నిర్మాణం చివరి దశకు చేరగా మార్చి 9న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment