64 కేజీల గంజాయి స్వాధీనం
మణుగూరు టౌన్: ఒడిశా నుంచి మణుగూరు మీదుగా బెంగళూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరమ్‌చంద్ కథనం ప్రకారం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి కేరళకు చెందిన మహ్మద్ జమీర్ కారులో బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నాడు. పక్కా సమాచారంతో కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్, మణుగూరు ఎక్సైజ్ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. మణుగూరు రథంగుట్ట అర్బన్ పార్క్ సమీపంలో అనుమానాస్పద వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేయగా, 64 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కారు విలువ రూ.19.10 లక్షలు ఉంటుందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐలు గౌతమ్, కిశోర్‌బాబు, సిబ్బంది హబీబ్ పాషా, వెంకట నారాయణ, సుమంత్, ప్రసన్న, శ్రీను, ఆంజనేయులు, పార్ధసారథి, రమేశ్ పాల్గొన్నారు. గంజాయి పట్టుకున్న బృందాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఖమ్మం డివిజన్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితరులు అభినందించారు.
భద్రాచలంలో 17 కేజీలు..
భద్రాచలంఅర్బన్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విక్రయించేందుకు రెండు బైక్‌లపై నలుగురు యువకులు 17 కేజీల గంజాయిని ఒడిశా సరిహద్దు నుంచి తీసుకెళ్తుండగా పట్టణంలోని కూనవరం రోడ్డులో బుధవారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నా రు. ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయిని, రెండు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు భద్రాచలం ఎకై ్సజ్ సీఐ షేక్ రహీమున్నీసా బేగం తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజు, సిబ్బంది ఆలీం, జమాల్, బాబు, వీరబాబు, లలిత, రాకేష్, కిరణ్ ఉన్నారు.
కారు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment