కొత్తగూడెంటౌన్: యువతిపై హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ గురువారం కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బత్తుల రామారావు తీర్పు చెప్పారు. వివరాలు ఇలా.. భద్రాచలం రాజంపేటకు చెందిన పోసారపు జాన్‌రాజు బట్టల షాపు నిర్వహిస్తుండగా గుడిమల్ల జగదీష్ న్యూసెన్స్ చేయడంతో మందలించారు. దీంతో జగదీష్ కక్ష పెంచుకుని జాన్ రాజు పెద్ద కూతురు హిందు వర్షిత గొంతు కోసి గాయపర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఎనిమిది మంది సాక్షులను విచారించాక గుడిమల్ల జగదీష్‌పై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. సీఐ బి.రమేష్, సిబ్బంది జి. ప్రవీణ్‌కుమార్, ఎం.శ్రీనివాస్, సుఽధీర్‌బాబు సహకరించారు.
చెల్లని చెక్కు కేసులో...
భద్రాచలంటౌన్: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివనాయక్ గురువారం తీర్పు ఇచ్చారు. పట్టణానికి చెందిన రామాలయ ఉద్యోగి శ్రీరంగం నరసింహాచార్యులు చెక్కును హామీగా పెట్టి రాంప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు, పద్మారాణి వద్ద రూ. 2 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో బాధితులు హామీగా పెట్టిన చెక్కులను బ్యాంకులో వేయగా అవి చెల్లనవిగా తేలింది. బాధితులు కోర్టును ఆశ్రయించగా వాదోపవాదనల అనంతరం న్యాయమూర్తి నిందితునికి ఆరు నెల జైలుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment