పాల్వంచ: పట్టణంలోని ఐటీసీ డీలర్ గోడౌన్‌లో భారీ మొత్తంలో సిగరెట్లను చోరీ చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ చేసింది రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గత జనవరి 4న రాత్రి టీటీటీ కల్యాణ మండపం రోడ్‌లోని ఐటీసీ డీలర్ స్టాక్ పాయింట్‌లో దొంగలు పడి సుమారు రూ.26 లక్షల విలువైన 24 కాటన్ల సిగరెట్లను అపహరించారు. దీంతో షాపు నిర్వాహకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాల సేకరించారు. కాగా చోరీ చేసిన సిగరెట్లలో రూ.6 లక్షల సరుకును మణుగూరులో ఓ షాపులో, మిగతా సరుకు కొంత హైదరాబాద్‌లో విక్రయించినట్లు సమాచారం. ఆ విక్రయాల ఆధారంగా వచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. గతంలో శాసీ్త్రరోడ్‌లో ఓ హోల్ సేల్ షాపులో పనిచేసే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి గుమస్తాగా కొంత కాలం పనిచేశాడు. అడపాదడపా ఐటీసీ గోదాంలో సరుకు తెచ్చేందుకు వెళ్లే అతను మరికొందరితో కలిసి సిగరెట్లు అపహరించి, రాజస్థాన్‌కు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రాజస్థాన్ వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరికి పలు చోరీల్లో కూడా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా నవభారత్ కాలనీలో పలువురు అధికారుల ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తూ పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రాజస్థాన్ వ్యక్తులుగా గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment