ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష
కొత్తగూడెంటౌన్: అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడేనికి చెందిన గుమలాపురం సురేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ గురువారం కొత్తగూడెం రెండో అదన పు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా... కొత్తగూడెం కూలీలైన్‌కు చెందిన శారదకు పట్టాయిగూడెం గ్రామానికి చెందిన గుమలాపురం సురేష్‌తో వివాహం జరగ్గా, రెండు లక్షల నగదు, ఇంటి స్థలం, బంగారం వరకట్నంగా అందజేశారు. కొంతకాలంపాటు కాపురం సవ్యంగా సాగగా కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత సురేష్ నిత్యం మద్యం తాగి కొడుతూ అదనంగా మరో రూ.2లక్షల కట్నం కావాలని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన శారద భర్త, అతని తండ్రి తండ్రి కృష్ణపై ఫిర్యాదు చేయగా త్రీటౌన్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. నలుగురు సాక్షులను విచారించిన జడ్జి సురేష్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కృష్ణపై నేరం రుజువుకాకపోవడంతో కేసు కొట్టి వేశారు. ఏపీపీఓ విశ్వశాంతి ప్రాసిక్యూషన్ నిర్వహించగా, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్‌కుమార్, లైజన్ ఆఫీసర్ ఎస్‌కే అబ్దుల్ ఘని, సిబ్బది బి.శోభన్, బి.రవి సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment