
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
● మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రతపై పరిశీలన ● బూర్గంపాడు ఎస్సీ బాలుర హాస్టల్‌లో రాత్రి బస
బూర్గంపాడు: బూర్గంపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి సరుకుల నాణ్యత, బియ్యం స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సరుకులు నాణ్యంగా ఉంటేనే వంట చేయాలని వంట ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం టాయిలెట్స్, బాత్‌రూమ్స్, కిచెన్ పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు తీయించాలని చెప్పారు. మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రం చేయించాలన్నారు. విద్యార్థులు నిద్రించే బెడ్లను పరిశీలించి, బెడ్స్ అందరికీ సరిపోతున్నాయా...లేకపోతే ఎవరైనా నేలపై పడుకుంటున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. స్టడీ అవర్‌లో విద్యార్థులకు గణితంలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వ్యక్తిత్వ వికాసం, లక్ష్యసాధనపై విద్యార్థులతో చర్చించారు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా చదువుకోవాలని, వెనుబడిన సబ్జెక్ట్‌లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, ప్రతీ విద్యార్థి జీవితాన్ని పదో తరగతి ఫలితమే మలుపు తిప్పుతుందన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసిన కలెక్టర్ రాత్రి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, హాస్టల్ వార్డెన్, సిబ్బంది ఉన్నారు.
భవిత కేంద్రాలతో ఉజ్వల భవిష్యత్
కొత్తగూడెం అర్బన్/పాల్వంచ: దివ్యాంగ బాలల ఉజ్వల భవిష్యత్‌కు భవిత కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం రైటర్ బస్తీలోని, పాల్వంచలోని భవిత కేంద్రాలను పరిశీలించి దివ్యాంగ పిల్లలకు కావాల్సిన ఉపకరణాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెంలో పాత భవనం తొలగించి ఆట స్థలం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి, ఎస్.సైదులు, శ్రీరామ్మూర్తి, శ్రీరామ్, కనకదుర్గ, అరుణ, అనిత పాల్గొన్నారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment