
రామక్క జాతరకు తరలిన భక్తులు
గుండాల: ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో కొమరం వంశీయుల ఇలవేల్పు రెక్కల రామక్క జాతరకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించారు. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు చుట్టుపక్క ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు అన్నిఏర్పాట్లు చేశారు.
దర్శించుకున్న ఎస్పీ
రామక్క జాతరకు ఎస్పీ రోహిత్‌రాజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతర ప్రాశస్త్యాన్ని కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి సీఐ సురేశ్, ఆళ్లపల్లి ఎస్‌ఐ రతీశ్, కొమరం వంశీయులు వెంకటేశ్వర్లు, హనుమంతరావు, సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.1.20 లక్షల విరాళం
అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామంలో నిర్మిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి జాలె రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కుమార్తెలు రూ.1.20 లక్షలు విరాళంగా అందించారు. శుక్రవారం ఆలయం ఆవరణలో ఆలయ నిర్మాణ కమిటీ వారికి అందజేశారు. గతంలో సైతం రామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆలయ నిర్మాణానికి రూ.80,580 అందజేశారు.
ఏసీబీ పేరుతో బెదిరింపు ఫోన్లు
అశ్వాపురం: ఏసీబీ కార్యాలయం అధికారులమంటూ మండలంలోని అధికారులకు శుక్రవారం బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఏసీబీ కార్యాయలం నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి తహసీల్దార్‌కు ఫోన్‌చేసి ఎంపీడీ ఓ ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు. ఆమె తన ఫోన్ నుంచి ఎంపీడీఓకు ఫోన్ చేయగా ఫోన్ చేసిన వ్యక్తి ఏసీబీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని తమపై ఫిర్యాదు వచ్చిందని బెదిరించారు. తర్వాత అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేశారు. దీంతో అధికారులు సీఐ అశోక్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఫేక్ ఫోన్‌కాల్స్ అని ధ్రువీకరించారు.
చోరీ ఘటనపై కేసు
ములకలపల్లి: మండలంలోని జగన్నాథపురం మెయిన్‌రోడ్డులోని దుకాణంలో చోరీ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజశేఖర్ కఽథనం మేరకు.. జగన్నాథపురానికి చెందిన వ్యాపారి జయవరపు నరేశ్ మెయిన్ సెంటర్లో ఇల్లు నిర్మించుకొని ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. నరేశ్ దంపతులు ఈ నెల 15వ తేదీన కుంభమేళాకు వెళ్లారు. మరుసటి రోజు ఇంటి వెనుక తలుపు తాళాలు పగలగొట్టగా పక్కవారు గమనించి నరేశ్‌కు సమాచారం అందించారు. గురువారం కుంభమేళా నుంచి వచ్చి ఇంట్లో పరిశీలించగా రూ.45 వేల విలువ గల బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పీడీఎస్ బియ్యం స్వాధీనం
గోవిందరావుపేట: అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు. పస్రామండలం మొద్దులగూడెం శివారులో శుక్రవారం తనిఖీ చేస్తుండగా లారీలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. లారీలో రూ.6.47లక్షల విలువైన రేషన్ బియ్యం ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంకు చెందిన బత్తుల రాజు తరలిస్తున్నట్లు డ్రైవర్ వల్లెపు బంగారి అంగీకరించాడని ఎస్సై తెలిపారు. ఇల్లెందు చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు సేకరించిన బియ్యాన్ని ఎక్కువ ధరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లో అమ్ముతున్నట్లు గుర్తించామని వెల్లడించారు.
ఆయిల్‌ఫెడ్ డివిజన్ అధికారిపై వేటు
సత్తుపల్లి: సత్తుపల్లి డివిజన్ ఆయిల్‌ఫెడ్ అధికారి బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని రేగళ్లపాడు న ర్సరీలో ఆఫ్‌టైప్(నాటడానికి పనికి రానివి)గా తేలి న 80వేల ఆయిల్‌పామ్ మొక్కలను అనుమతి లే కుండా ధ్వంసం చేయించినట్లు ఆయనపై ఫిర్యాదు లు వచ్చాయి.ఇందుకోసం వెచ్చించిన నిధులు డ్రా చేసినట్లు తెలుస్తుండగా, ఈనెల 9, 10వ తేదీల్లో ఉద్యానశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు వారిచ్చిన నివేదిక ఆధారంగా బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, గతంలోనే నర్సరీ సూపర్‌వైజర్లు పృధ్వీలాల్, కృష్ణారావును విధుల నుంచి తొలగించిన విషయం విదితమే.

రామక్క జాతరకు తరలిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment