పెనుబల్లి: యువతిని హత్య చేసిన కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జడ్జి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్విని గంగారంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివేది. సత్తుపల్లికి చెందిన బెల్లేడు నితిన్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడగా, మాయమాటలు చెప్పి ఇంటి నుంచి 2019 ఆగస్టులో బైక్‌పై తీసుకెళ్లిన ఆయన లంకపల్లి గుట్టల వద్ద కర్చీప్‌తో ఉరివేసి హతమార్చాడు. ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయగా.. సీఐలు టి.సురేష్‌కుమార్, టి.రవికుమార్, టి.కరుణాకర్ దశల వారీగా విచారణ జరిపి నితిన్‌ను నిందితుడిగా గుర్తించి సత్తుపల్లి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ అనంతరం నితిన్ నిందితుడిగా తేలడంతో జీవిత ఖైదు విధించడమే కాక రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని సత్తుపల్లి రూరల్ సీఐ ఎం.ఎల్.ముత్తిలింగయ్య తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్ పాషా కేసు వాదించగా ఉద్యోగులు కె.శ్రీకాంత్, డి.నాగేశ్వరరావులు, కె.గిరి సహకరించారు. కాగా, తీర్పు వెలువడ్డాక నిందితుడిని వీఎంబంజర్ ఎస్సై కె.వెంకటేష్ సబ్‌జైల్‌కు తరలించారు.
ప్రేమ పేరుతో తీసుకెళ్లిన యువకుడు హత్య చేసినట్లు నిర్ధారణ
Comments
Please login to add a commentAdd a comment