కబడ్డీ టోర్నీ విజేత విజయవాడ
ఎర్రుపాలెం: మహాశివరాత్రి పండుగ సందర్భంగా మండలంలోని బనిగండ్లపాడు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి, ఈ పోటీల్లో విజేతగా ఏపీలోని విజయవాడ సాయి సెంటర్ జట్టు నిలిచి రూ.25వేలు, ఖమ్మం అకాడమీ జట్టు రెండో స్థానంలో నిలిచి రూ.20వేల నగదు బహుమతి గెలుచుకున్నాయి. అలాగే, మూడు నుంచి ఆరో స్థానం వరకు బనిగండ్లపాడుకు చెందిన పెద్దమళ్ల వెంకటేశ్వర్లు మెమోరియల్ జట్టు, వై.కే.రెడ్డి రాజుల దేవరపాడు, బనిగండ్లపాడు జీవీకే ఈవెంట్స్, బనిగండ్లపాడు గణేష్ మార్కెట్ జట్లు నిలవగా నగదు బహుమతులు అందజేశారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, శివాలయం వ్యవస్థాపకులు ఐలూరి అంకిరెడ్డి –విజయలక్ష్మితో పాటు యరమల పూర్ణచంద్రారెడ్డి, గుర్రాల శ్రీనివాస్‌రెడ్డి, యన్నం పిచ్చిరెడ్డి, పెద్దమళ్ల మోహన్‌రావు విజేతలకు బహుమతులు అందజేయగా అర్చకులు కాశవఝల నర్సింహమూర్తితో పాటు ,అనుమోలు కృష్ణారావు, యన్నం సత్యనారాయణరెడ్డి, శీలం ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment