పంప్‌హౌస్–2 నుంచి గోదావరి జలాల ఎత్తిపోత
ములకలపల్లి : మండల పరిధిలోని వీకే రామవరం శివారు సీతారామ పంప్‌హౌస్–2 నుంచి గోదావరి జలాలను ఆదివారం ఎత్తిపోశారు. నాలుగు రోజుల క్రితం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్–1 నుంచి గోదావరి జలాలు లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం నీరు పంప్‌హౌస్–2 కెనాల్ ఫుల్ సప్లై లెవల్ (ఎఫ్‌ఎస్‌ఎల్) 67.17 మీటర్లకు చేరింది. దీంతో నీటిని ఎత్తి మోటారు ద్వారా దిగువన ఉన్న పంప్‌హౌస్–3 (కమలాపురం)కు వదిలారు. గంటసేపు మోటార్లు నడిపించి, విజయవంతంగా నీటికి కాలువలోకి మళ్లించారు. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కమలాపురం ఉండగా, ఏడు గంటల్లో జలాలు చేరతాయని నీటిపారుదల శాఖ డీఈ మోతీలాల్ తెలిపారు. రెండు రోజుల్లో కమలాపురం పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గ్రావిటీ ద్వారా ఏన్కూర్ లింక్ కెనాల్‌కు, అక్కడి నుంచి ఎన్నెస్పీ కాల్వకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment