దండకారణ్యంలో శాంతి నెలకొల్పుతాం
చర్ల: దండకారణ్యంలోని గ్రామాల్లో శాంతిని నెలకొల్పేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని సీఆర్‌పీఎఫ్ 151 బెటాలియన్ ఛత్తీస్‌గఢ్ సెక్టార్ ఐజీ రాకేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధి కౌరగట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఆదివారం సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. సమీప కంచాల, బట్టిగూడెం, దామవరం, జీడిపల్లి, గాదిగూడెం, మీనగట్ట తదితర గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, వ్యవసాయ సామగ్రి, క్రీడా సామగ్రి, విద్యార్థులకు యూనిఫాం, స్టేషనరీ, సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో అసాంఘిక శక్తుల వల్ల నెలకొన్న భయాందోళనలను పోగొట్టి శాంతిని నెలకొల్పేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలీస్‌శాఖ కృషి చేస్తోందని తెలిపారు. సీఆర్పీఎఫ్ డీఐజీ ఎన్‌కే సింగ్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజీవ్‌కుమార్, కమాండెంట్ రంజన్ ప్రకాశ్, డిప్యూటీ కమాండెంట్ లీలామోహన్ కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ నీరజ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
సీఆర్‌పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment