ఇరుకు దారిలో ప్రమాదం, స్తంభించిన ట్రాఫిక్
ఖమ్మంరూరల్: మండలంలోని జలగంగనర్ వద్ద శనివారం కారును లారీ ఢీకొట్టగా ఇరుకుదారి కావడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపు నుండి ఖమ్మం వస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. కాగా, మున్నేరు వద్ద తీగల వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా, మూడు నెలల క్రితం మున్నేటి పాత బ్రిడ్జిపై నుండి సైతం రాకపోకలు నిలిపేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మున్నేటి బిడ్జి కింది నుండి తాత్కాలికంగా సింగిల్ రోడ్డు వేయగా ఈ రహదారిపై ప్రమాదం జరగడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని లారీని పక్కకు తీయించి, ఖమ్మం నుండి జలగంగనర్ వైపు వచ్చే వాహనాలను ఎంపీడీఓ కార్యాలయం పక్క నుండి మళ్లించారు. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment