చర్ల: మండలంలోని దానవాయిపేటలోని ఫారెస్టు భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబంధించి మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ద్వాలియా కథనం ప్రకారం.. దానవాయిపేట శివారులోని ఫారెస్టు భూమిలో కొంత కాలంగా ఒక నిర్మాణం కొనసాగుతోంది. ఈ విషయమై గతంలో పనులు నిలిపివేయాలని హెచ్చిరంచినప్పటికీ వారు పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తుండటంతో ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి నిర్మాణం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు.
ఇరవెండి ఎఫ్‌బీఓపై
సస్పెన్షన్ వేటు
బూర్గంపాడు: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో బూర్గంపాడు మండలంలోని ఇరవెండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్‌పతిని అటవీశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇరవెండి ఫారెస్ట్ బీట్‌లో అటవీ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణలతో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్ ఇరవెండి ఫారెస్ట్ బీట్‌ను పరిశీలించారు. పోడు నరికినప్రాంతాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. విధు ల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో బీట్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment